టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 సార్లు ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ముకేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వగా.. ఆయన కొన్నింటికి వివరణ ఇచ్చారు. మరికొన్ని నోటీసులకు సమాధానం ఇవ్వనట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు వివరణపై సంతృప్తి చెందని ముకేష్ కుమార్ మీనా.. చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాసిన మీనా.. చంద్రబాబు వ్యాఖ్యల తాలూకూ వీడియోలను కూడా జతచేశారు. మరి ఏపీ సీఈవో సిఫార్సులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసకుంటుందో చూడాలి మరి.