టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి వైయస్ఆర్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.