రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గానే ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పర్వంలో భాగంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఘట్టంలో భాగంగా వాంబే కాలనీ దగ్గర కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన ఐదు సంవత్సరాలలో మనం అమలు చేసిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున మధ్య తరగతి, బీద, బడుగు,బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాయి. స్వాతంత్యం వచ్చిన తరువాత వారి అవసరాలు తీరక నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఈ బీదవర్గాలు ఈ ఐదు సంవత్సరాలూ సంతోషంగా వారి ఆశలు నెరవేరే విధంగా,ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మేం కూడా అభివృద్ధి చెందగలం, అభివృద్ధి చెందినటువంటి సమాజంలో మేం కూడా సభ్యులం కాగలం అన్న విశ్వాసం ఈనాడు రాష్ట్రమంతా వ్యక్తం అవుతోంది. ఇలాంటి సందర్భాన జరుగుతున్న ఎన్నిక ఇది. మనం ఐదు సంవత్సరాలలో చేసిన పరిపాలనకు సంబంధించి ప్రజలు తీర్పు ఇచ్చే సమయం ఇది. సంక్షేమం,అభివృద్ధి ప్రధానంగా సాగిన ప్రభుత్వానికి ప్రజలు మరోసారి ఆదరించేందుకు సిద్ధంగా ఉన్న సమయం ఇది. గడిచిన కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలకూ వ్యతిరేకంగా ధనవంతులకు కొమ్ముగాసి,లంచగొండి వ్యవహారాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మనం మన ప్రాంతానికి సంబంధించి పరిపాలన రాజధానిని విశాఖపట్టణంలో పెట్టాలని కోరాం. సీఎం వైయస్ జన్ అంగీకరించి విశాఖపట్టణమే పరిపాలన రాజధాని మళ్లీ మన ప్రభుత్వం వస్తే చేస్తానని కూడా మాట ఇచ్చారని కూడా మీ అందరికీ విన్నవిస్తున్నాను.తద్వారా తరతరాల నుంచి వెనుబడ్డ ఈ ప్రాంతాల అభివృద్ధిని సాధిస్తుందని మనం అంతా నమ్ముతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు,దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడులు విశాఖ పరిసర జిల్లాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు, పిల్లలకు ఉన్న సంపదలు పెరిగి అందరి ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయని మీ అందరికీ విన్నవిస్తున్నాను. మీ అందరికీ ఒకటే మాట శ్రీకాకుళం నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలలో ఇరవై వేల ఇళ్లకు భూమిని కొని ఇవ్వడం జరిగింది. సంబంధింత పట్టాలు అందించాం. చదువుకు నోచుకోని పిల్లలకు అవసరం అయినటువంటి అన్ని సదుపాయాలూ ఇచ్చి,ఆ బిడ్డలను చదివించి పెద్దవాళ్లను చేసి వారిని కూడా ఈ సమాజంలో గౌరవం అయిన స్థానానికి తీసుకుని రావడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందన్న విషయం మీకు నేను చెప్పనక్కర్లేదు. మన జిల్లా అభివృద్ధిని తీసుకుంటే టెక్కలిలో మూలపేట వద్ద పోర్టు నిర్మాణం జరుగుతోంది. మరో ఆరు మాసాలలో ప్రపంచంలో ఏ పట్ణణంతో అయినా సముద్ర తీర మార్గం ద్వారా శ్రీకాకుళం 75 సంవత్సరాల తరువాత మొదటి సారి ప్రపంచంతో కనెక్ట్ కాబోతుందని తెలియజేస్తున్నాను. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్,మన హెడ్ క్వార్టర్స్..లో అక్కడ హాస్పిట ల్,ఇక్కడ కలెక్టరేట్, ఉద్దానంలో తీసుకుంటే మంచినీటి ప్రాజెక్టు,పలాసలో తీసుకుంటే మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్, ఊరురా స్కూల్స్,ఊరూరా సెక్రటేరియట్ బిల్డింగ్స్,వెల్నెస్ సెంటర్స్..ఏర్పాటు చేశాం. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు నాయుడు అందరికీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.మేం చెప్పిన కార్యక్రమాలలో ఒక కుటుంబానికి కానీ ఒక గ్రామానికి కానీ ఒక జిల్లాకు కానీ ఈ రాష్ట్రానికి 2014 నుంచి 19 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి అయినా మీరు చేయగలిగారా .. ఉంటే రుజువు చూపించండి అని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. అనేక సార్లు ఈ నియోజకవర్గంలో గెలిపించినటువంటి మీకు ఇంకొక గెలుపుగా గొప్ప విషయమేమీ కాదు. ఇవాళ జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ చూస్తే వార్ వన్ సైడే ఉందని తేలిపోయింది. మే 13న ఎన్నిక జరుగుతుంది. ఇదే సందర్భంగా మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ మంచి మిత్రుడు,మన అనుచరుడు,మనందరికీ కావాల్సినటువంటివాడు. ఆయనకు కూడా ఓటు వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులివురునీ గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు,పౌరులు,సోదరీమణులు పార్టిసిపేట్ చేయడానికి అన్ని డివిజన్లు నుంచి వచ్చారు. వారు రావాడానికి ఏర్పాట్లన్నీ నాయకులందరూ చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ.. కార్యకర్తల విశ్వాసం ఎన్నటికీ వృథాపోదు. ఈ నెల 13 వరకూ మీ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అని ధర్మాన పేర్కొన్నారు.
![]() |
![]() |