ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక స్టాండ్ అప్ షోను అడ్డుకున్న మహిళా కార్యకర్తలపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వారిని ఉద్దేశించి ఆమె.. ఫ్రెంచ్‌లో "sales connes", ఇంగ్లీష్‌లో "stupid b**ches" అని అన్నారు. దీంతో ఫెమినిస్ట్ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. సోమవారం ఆమె క్షమాపణలు చెప్పారు. అయినా ఆమెపై రచ్చ ఆగట్లేదు. దేశవ్యాప్తంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం అవుతూనే ఉంది.
అసలేమిటీ వివాదం?
డిసెంబర్ 7వ తేదీన బ్రిగిట్టే మాక్రాన్.. ఫ్రెంచ్ నటుడు ఆర్ అబిట్టన్ స్టాండ్ అప్ షోకు హాజరు అయ్యారు. అయితే నటుడు ఆర్ అబిట్టన్‌పై 2021లో అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2023లో దర్యాప్తు సంస్థలు కేసును కొట్టివేశాయి. జనవరిలో అప్పీల్ కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితేతాజాగా అతడు షో నిర్వహిస్తుండగా.. కొందరు మహిళా కార్యకర్తలు వచ్చి ఈ షోను అడ్డుకున్నారు. ముఖ్యంగా అబిట్టన్ ముఖానికి 'రేపిస్ట్' అని రాసిన మాస్కులు ధరించి నినాదాలు చేశారు. అప్పటికే అక్కడన్న ఫ్రెంచ్ ఫస్ట్ లేడీ బ్రిగట్టే మాక్రాన్.. షో తర్వాత నటుడితో మాట్లాడుతూ కనిపించింది. ఈ సమయంలోనే ఆమె ఆర్ అబిట్టన్‌తో.. మహిళా కార్యకర్తలను ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడారు. ముఖ్యంగా ఫ్రెంచ్‌లో "sales connes", ఇంగ్లీష్‌లో "stupid b**ches" అని అన్నారు.
అయితే ఇదంతా అక్కడే ఉన్న ఈ వీడియోలు రికార్డు కావడం.. ఇది కాస్తా బయటకు రావడంతో వివాదం రాజుకుంది. ముఖ్యంగా ఈ వీడియో సోషల్ మీడియాలో #SalesConnes అనే హ్యాష్‌ట్యాగ్‌తో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఆస్కార్ అవార్డు గ్రహీత మరియన్ కొటిల్లార్డ్ వంటి ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి ప్రథమ మహిళ అయిన ఆమె.. మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడడం సరికాదని అన్నారు. దాదాపు 60 ఫెమినిస్ట్ గ్రూపుల కూటమి అయిన "ఫెమినిస్ట్ స్ట్రైక్".. బ్రిగిట్టే మాక్రాన్‌ను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
క్షమాపణ చెప్పినా..
అయితే తాజాగా బ్రిగిట్టే మాక్రాన్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "బాధితులైన మహిళలను నేను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి" అని మీడియా ముందు చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలు ప్రైవేట్‌గా చేసినవని, వాటి పట్ల తాను విచారం వ్యక్తం చేయలేనని చెప్పారు. "నేను రిపబ్లిక్ అధ్యక్షుడి భార్యనే అయినప్పటికీ.. వీటన్నింటికీ మించి నేను నేనుగా ఉండాలి. అందుకే ప్రైవేట్‌గా ఉన్నప్పుడు నేనుఏదైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడే స్వేచ్ఛ నాకుంది" అని ఆమె వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa