ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసిరి + కరివేపాకు + కలోంజి నూనెతో....., తెల్ల జట్టు నల్ల

Life style |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 11:23 PM

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో యువత ఆందోళన చెందుతున్నారు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి కెమికల్ డై, రంగు, హెన్నా వంటివి వాడుతున్నారు. కొన్ని ప్రొడక్ట్స్‌లో రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టును నిర్జీవంగా మార్చే అవకాశం ఉంది. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, చెడు జీవనశైలి వంటి కారణాలు జుట్టు తెల్లబడటానికి దోహదం చేస్తున్నాయి. అయితే, జుట్టును తాత్కాలికంగా నల్లగా మార్చే అనేక రసాయన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల జుట్టు, తల చర్మానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు.


అయితే, కొన్ని సహజ నివారణలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి. అలాంటి ఓ సింపుల్ చిట్కాను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు. ఈ చిట్కాను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. దీనికి కేవలం మూడు పదార్థాలు చాలు. ఇంతకీ ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


కావాల్సిన పదార్థాలు


కలోంజి ఆయిల్ - ఒక కప్పు


ఉసిరి పొడి - 1 టేబుల్ స్పూన్


కరివేపాకు - 15 - 20 ఆకులు లేదా ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి


తయారీ విధానం


ఇది చాలా పురాతన పద్ధతి అని శ్వేతా షా చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఒక గాజు జార్ తీసుకోండి. ఈ గాజు జార్‌లో కలోంజి ఆయిల్, ఉసిరి పొడి, కరివేపాకు లేదా కరివేపాకు పొడి యాడ్ చేయండి. ఆ తర్వాత గాజు జార్ మూత కవర్ చేసి.. దాన్ని వేడి నీటిలో ఓ 2 గంటలు పాటు ఉంచండి. ఇలా చేయడం వల్ల బొటానికల్స్ యాక్టివ్ అవుతాయని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు. ఆ తర్వాత గాజు జార్‌ని తీసుకుని చల్లగా, చీకటిగా ఉన్న ప్రాంతంలో స్టోర్ చేయాలి.


శ్వేతా షా చెప్పిన చిట్కా


వాడే విధానం


ఈ ఆయిల్ వాడే ముందు.. కొంచెం తీసుకుని గోరువెచ్చగా చేయండి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయండి. పది నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి. జుట్టు కుదళ్లకు, చివర్లకు అప్లై అయ్యేలా మసాజ్ చేయండి. ఈ ఆయిల్‌ని వారానికి మూడు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని శ్వేతా షా వివరిస్తున్నారు. ఇది అప్లై చేసిన తర్వాత ఒకటి నుంచి రెండు గంటలు అలాగే వదిలేయండి. లేదంటే ఓ రాత్రంతా అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని లేదా చల్లని నీటితో వాష్ చేసుకోండి.


ప్రయోజనాలు


​ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల చిన్న వయసులోనే జుట్టు నెరవడాన్ని నిరోధిస్తుంది.


జుట్టు మూలాల్ని స్ట్రాంగ్‌‌గా మారుస్తాయి. అంతేకాకుండా కురులు దృఢంగా మారతాయి.


జుట్టుకు సహజ మెరుపుని అందిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా మృదువుగా చేస్తుంది.


తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మూలాల నుంచి జుట్టు స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.


జుట్టుకు సరికొత్త లుక్ వస్తుందని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెబుతున్నారు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


పైన చెప్పిన చిట్కాతో పాటు శ్వేతా షా కొన్ని చిట్కాల్ని కూడా షేర్ చేశారు. అవి ఏంటంటే..


​ఉసిరి లేదా ఉసిరి జ్యూస్ డైట్‌లో భాగం చేసుకోవాలని శ్వేతా షా చెబుతున్నారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉసిరి జుట్టును బలంగా మారుస్తుంది. అంతేకాకుండా బూడిద రంగు జుట్టును నల్లగా మారుస్తుంది.


నల్ల నువ్వుల్ని కూడా డైట్‌లో భాగం చేసుకోండి. నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా మారుస్తాయి.


ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే జుట్టును బలంగా మారుస్తాయి.


ఆవు నెయ్యిని రోజుకు అర చెంచా తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa