ఏ రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. సరైన రవాణా సౌకర్యాలు ఉండాలి. ఆధునిక రవాణా వ్యవస్థలో రోడ్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఇప్పుడు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఫ్లైఓవర్లు అంటూ క్షణాల్లోనే దూసుకెళ్లే విధంగా నిర్మిస్తున్నారు. అత్యాధునిక రోడ్లు ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు.. వాణిజ్య రంగానికి మద్దతుగా నిలుస్తాయి. ఈ హైవేలు కొన్ని ఖండాలను కూడా కలుపుతుండటం విశేషం. ప్రపంచంలోని కొన్ని రహదారులు వేలాది కిలోమీటర్లు విస్తరించి.. ఎడారులు, అడవులు, పర్వతాలు, తీర ప్రాంతాల గుండా వెళ్తున్నాయి. వీటిలో సుమారు 48 వేల కిలోమీటర్ల పొడవుతో.. ప్యాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి నెట్‌వర్క్‌గా నిలిచింది. ఈ సుదీర్ఘ రహదారులు దేశాల ఆర్థిక వృద్ధికి, మారుమూల ప్రాంతాలను ప్రధాన పట్టణాలకు అనుసంధానించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రపంచంలోనే అతి పొడవైన టాప్ 10 రోడ్లు
ప్యాన్-అమెరికన్ హైవే, 48,000 కిలోమీటర్లు
హైవే 1, ఆస్ట్రేలియా, 14,500 కిలోమీటర్లు
ట్రాన్స్-సైబీరియన్ హైవే, రష్యా, 11,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ
ట్రాన్స్-కెనడా హైవే, 7,821 కిలోమీటర్లు
హైవే 10 (G10 ఎక్స్‌ప్రెస్ వే), చైనా, 4,100 కిలోమీటర్లు
యూఎస్ రూట్ 20, యునైటెడ్ స్టేట్స్, 5,415 కిలోమీటర్లు
హైవే 1, బ్రెజిల్, 4,500 కిలోమీటర్లు
హైవే 1, కెనడా, 8,030 కిలోమీటర్లు
గోల్డెన్ క్వాడ్రిలేటరల్, భారత్, 5,846 కిలోమీటర్లు
హైవే 1 (రుటా నేషనల్ 40), అర్జెంటీనా, 5,000 కిలోమీటర్లు
ప్యాన్-అమెరికన్ హైవే
ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డుగా ప్యాన్-అమెరికన్ హైవే నిలిచింది. ఇది అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని ప్రుధో బే నుంచి అర్జెంటీనాలోని ఉషువాయా వరకు సుమారు 48 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలోని అనేక దేశాల గుండా ప్రయాణిస్తుంది. వివిధ వాతావరణాలు, భూభాగాలను దాటుతూ.. ఈ రహదారి అమెరికా ఖండాలను అనుసంధానించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.
హైవే 1, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోని నేషనల్ 1 హైవే.. ఆ ఖండం చుట్టూ వృత్తాకారంలో ఉంటుంది. ఇది ప్రధాన నగరాలు, చిన్న పట్టణాలను కలుపుతూ మొత్తం 14,500 కిలోమీటర్లు నిర్మించారు. తీరప్రాంతాలు, ఎడారులు, అడవులు, గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ.. ఇది ప్రపంచంలోని అత్యంత పొడవైన, ముఖ్యమైన రోడ్డు మార్గాల్లో ఒకటిగా నిలిచింది.
ట్రాన్స్-సైబీరియన్ హైవే, రష్యా
ట్రాన్స్-సైబీరియన్ హైవే రష్యాలో పశ్చిమాన ఉన్న సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి తూర్పున ఉన్న వ్లాడివోస్టాక్ వరకు ఉంటుంది. ఇది మొత్తం 11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. రష్యా విభిన్న భౌగోళిక, సాంస్కృతిక ప్రాంతాలను కలుపుతూ ఇది ప్రయాణిస్తుంది.
ట్రాన్స్-కెనడా హైవే
కెనడా పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు ఈ ట్రాన్స్-కెనడా హైవే విస్తరించి ఉంది. ఇది 7,821 కిలోమీటర్ల పొడవుతో.. కెనడాలోని మొత్తం 10 ప్రావిన్సుల గుండా వెళ్తుంది. ఇది వాంకోవర్, కాల్గరీ, టొరంటో, ఒట్టావా, మాంట్రియల్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ.. పర్వతాలు, సరస్సులు, అడవుల సుందరమైన దృశ్యాలను ప్రయాణికులకు అందిస్తుంది.
హైవే 10 (G10 ఎక్స్‌ప్రెస్ వే), చైనా
దీన్ని బీజింగ్–షాంఘై మోటార్‌వే.. జీ10 గా కూడా పిలుస్తారు. ఇది చైనా ప్రధాన రహదారి మార్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇది దాదాపు 4,100 కిలోమీటర్లు పొడవు విస్తరించి.. చైనాలోని రెండు ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలను కలుపుతుంది. ఈ మోటార్‌వే అనేక చైనీస్ ప్రావిన్సుల్లో వాణిజ్యం, ప్రయాణానికి వెన్నెముకగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa