మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపద సృష్టించవచ్చు అనే చర్చ వచ్చిన ప్రతిసారి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తెరపైకి వస్తుంది. స్థిరమైన వృద్ధి రేటుతో తమ ఇన్వెస్టర్లకు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ హైరిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ ఏఎంసీ దేశంలోనే అత్యంత పురాతనమైన పథకాలను నిర్వహిస్తోంది. అందులో చాలా స్కీమ్స్ మార్కెట్ పరిస్థితులను తట్టుకుంటూ సంపద సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టాప్ 5 ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఈ స్కీమ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడుల ద్వారా హైరిటర్న్స్ ఇచ్చాయి. గత 20 ఏళ్లలో ఈ స్కీమ్స్ సగటున ఏడాదికి 16.06 శాతం నుంచి 17.57 శాతం మధ్య రిటర్న్స్ ఇచ్చాయి. మరి ఆ స్కీమ్స్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1.ఎస్‌బీఐ కన్సంప్షన్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్
ఎస్బీఐ ఏఎంసీలో గత 20 ఏళ్లలో అత్యధికంగా రాబడులు అందించిన స్కీమ్‌గా ఎస్‌బీఐ కన్సంప్షన్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ నిలుస్తోంది. ఈ స్కీమ్ సగటున 17.57 శాతం రాబడి ఇచ్చింది. నెల నెలా రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ ఫండ్ వాల్యూ రూ.1.83 కోట్లు అవుతుంది. ఈ స్కీమ్ 1999, జులైలో లాంచ్ చేశారు. నిఫ్టీ ఇండియా కన్సంప్షన్ టీఆర్ఐ బెంచ్ మార్క్, ఇందులో రిస్క్ హైగా ఉంటుంది.
2. ఎస్‌బీఐ టెక్నాలజీ ఆపర్చ్యూనిటీస్ ఫండ్
ఎస్బీఐ ఏఎంసీలో హైరిటర్న్స్ అందించిన స్కీమ్స్‌లో ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ ఒకటి. ఈ స్కీమ్ గత 20 ఏళ్లలో సిప్ రాబడులు సగటున 16.80 శాతంగా ఉన్నాయి. రూ.10 వేల నెలవారి పొదుపుతో రూ.1.67 కోట్లు వచ్చాయి. ఈ స్కీమ్ సైతం 1999, జులైలోనే లాంచ్ అయింది. ఇందులోనూ రిస్క్ లెవల్ వెరీ హైగా ఉంటుంది.
3. ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్
ఎస్‌బీఐ ఏఎంసీ నుంచి వచ్చిన ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ సైతం హైరిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ 2004, అక్టోబర్‌లో లాంచ్ అయింది. గత 20 ఏళ్లలో ఈ స్కీమ్ 16.14 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. ఇందులో రూ.10 వేల చొప్పున సిప్ పొదుపు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.1.53 కోట్లు అవుతాయి.
4. ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్
రెండున్నర దశాబ్దాలకుపైగా చరిత్ర గల ఎస్‌బీఐ హెల్త్ కేర్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ సైతం హైరిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ 1999, జులైలో లాంచ్ అయింది. గత 20 ఏళ్లలో చూస్తే సగటున 16.08 శాతం రాబడులు ఇచ్చింది. ఇందులో నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.1.52 కోట్లు అవుతుంది.
5. ఎస్‌బీఐ మిడ్ క్యాప్ ఫండ్
ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఎస్‌బీఐ మిడ్ క్యాప్ ఫండ్ 2005 మార్చిలో లాంచ్ అయింది. అప్పటి నుంచి చూసుకుంటే వార్షికంగా సగటు సిప్ రాబడి 16.06 శాతంగా ఉంది. ఇందులో రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.1.51 కోట్లు అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa