మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్రకు సంకేతమని పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజల గుండుచప్పుడే ఈ సిద్ధం సభ. వైయస్ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. బస్సు యాత్రలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరుకు జన సునామీ చూశామన్నారు. 58 నెలల కాలంలో రాష్ట్రంలో విద్యా, వైద్య, ఆరోగ్యం రంగాల్లో మార్పులు తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధమన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు. మంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు. అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పని. ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ.. అంటూ సీఎం వైయస్ జగన్ దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానిది. బాబు లాంటి మోసగాడు కావాలా? వైయస్ జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?. అని సీఎం వైయస్ జగన్ ప్రశ్నించారు.
![]() |
![]() |