ఆంధ్రప్రదేశ్‌లో రిచెస్ట్ సీఎం ఉన్నారు.. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి మీరేనని మీడియా గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థినే, తన లక్ష్యం వేరు అని సమాధానం ఇచ్చారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, జగన్‌తో తనను పోల్చొద్దని సూచించారు. 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు. 30 ఏళ్లు కష్టపడితే, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని వివరించారు. జగన్ క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగారని స్పష్టం చేశారు. ఆయన కష్టపడలేదని చెప్పారు. తననే కాదు కష్టపడి పైకి వచ్చిన ఎవరిని జగన్‌తో పోల్చిన అంగీకరించరు అని పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.