గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కూటమి నేతలు, కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లింది. నామినేషన్ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ర్యాలీని విజయవంతం చేశారన్నారు. ప్రతి ఒక్క కూటమి కార్యకర్త, నేతకు ధన్యవాదాలు తెలియజేశారు. గన్నవరం ప్రజలు విజ్ఞులని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరంలో తన గెలుపు గ్యారంటీ అని స్పష్టం చేశారు. గన్నవరం ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు కన్నీటికి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెబుతారని యార్లగడ్డ వెంకటరావు పేర్కొన్నారు.
![]() |
![]() |