సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్‌కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. డమ్మీ అభ్యర్థిగా తన కోడలు శృతి నామినేషన్ దాఖలు చేశారన్నారు. పిలుపు ఇవ్వకపోయిన సర్వేపల్లి ప్రజలు వేలాదిగా తరలివచ్చారని తెలిపారు. మేనిఫెస్టో ద్వారా వంద హామీలు ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మరన్నారు. మద్య నిషేధం, 45 ఏళ్లకే పింఛన్, కరెంటు చార్జీలు హామీలను విస్మరించిన జగన్ని ప్రజలు నమ్మరన్నారు. 99 శాతం హామీలు అమలు చేసాను అని జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల, అరాచకాల రాష్ట్రంగా జగన్ మార్చారని విరుచుకుపడ్డారు. ఐదేళ్ల దోపిడీపై ప్రతిఘటనకు బహుమానంగా తనపై 18 కేసులు పెట్టారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్ మందును ఎరులై పారిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కల్తీ మద్యం.. ఇప్పుటి ఎన్నికలు మద్యంతో చేయాలని కాకాణఇ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకణి కల్తీ మద్యానికి బలి కావద్దని ప్రజలకు విన్నవించారు. సర్వేపల్లి ప్రజలు కాకాణికి ప్రతిఘటన సినిమా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.