ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-1లో బాంబు ఉందన్న ఫోన్ కాల్ ఎయిర్‌పోర్టు అధికారులను పరుగులు పెట్టించింది. టెర్మినల్ మొత్తం జల్లెడ పట్టి బాంబు లేదని నిర్ధారించుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల నుంచి వచ్చిన బెదిరింపు కాల్ అయి ఉండొచ్చని అన్నారు. ఓ ఉద్యోగి కాల్ అందుకున్నట్లు వెల్లడించారు. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.