ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు అంటే నమ్మకం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:13 AM

వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టో ప్ర‌జా మేనిఫెస్టో అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీతా  అభివ‌ర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి పాలనలో 5ఏళ్ళు పేదల అభివృద్దే దిశగా పధకాలు అమలయ్యాయ‌న్నారు. పోతుల సునీతా మీడియాతో మాట్లాడుతూ.... వైయస్ జగన్ చెప్పింది చేస్తాడు...చేసిందే చెబుతాడనేది ప్రజలకి నమ్మకం.సామాజిక న్యాయంలో bc sc st మైనారిటీలకు నిజమైన నమ్మకం వచ్చేలా చేసిన వ్యక్తి వైయస్ జగన్.మా పార్టీ మేనిఫెస్టోను చంద్రబాబు మాయ ఫెస్టో  అని విమర్శించడం సరైన విధానం కాదు.టిడిపి మేనిఫెస్టోను వెబ్ సైట్ లో ఉంచేందుకు ధైర్యం లేని చంద్రబాబు ప్రజలకు మేలు చేసే వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టోను విమర్శించడం ఏంటి.2014లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు ఏం అయ్యాయి.చంద్రబాబు డ్వాక్రారుణమాఫీ అని మహిళలను మోసం చేసాడు.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.రైతు రుణమాఫి అంటూ రైతులను మోసం చేశాడు.84 వేలకోట్లకుపైగా రుణమాఫి అని చెప్పి కేవలం 14 వేల కోట్ల రూపాయలు మాత్రమే చేశాడు.చంద్రబాబు గ్రాఫిక్స్ తో  అమరావతి చూపిస్తాడు ,పోలవరంని ఏటిఎం లా వాడుకున్నాడు.చంద్రబాబు పాలనపై అన్ని వర్గాలకి విసుగు వచ్చే తెలుగుదేసం పార్టీని చెత్తబుట్టలో పడేశారు. ప్రతిపక్ష పార్టిగా మీరు ప్రజలకి ఏం చేశారు.కరోనా సమయంలో చంద్రబాబు,పవన్ హైదరాబాద్ లో దాక్కున్నారు. రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు అంటే నమ్మకం లేదు..ప్రజలని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అమ్మఒడి,వసతి దీవెన,చేదోడు అంటూ అనేక పథకాలు ఇచ్చిన వ్యక్తి వైయస్ జగన్.మేనిఫెస్టో లో నాడు-నేడు అభివృద్ధి కి, అమ్మఒడికి వేసే మొత్తాలు పెంచారు.రైతు భరోసా మొత్తాలను పెంచారు.  చేయూత,కాపు నేస్తం కొనసాగాగేలా మా మేనిఫెస్టో ఉంది. 17 మెడికల్ కాలేజ్, పోర్టులు,ఫిషింగ్ హార్భర్స్  నిర్మాణం జరుగుతుంది. మధ్యవర్తులకు అవకాశం లేకుండా అవినీతికి తావులేకుండా  ప్రజల ఖాతాలో నేరుగా 2లక్షల 70వేల కోట్లు జగన్ గారి ప్రభుత్వం జమ చేసింది. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్,గ్రంధం,ఖురాన్ లాంటిది.చంద్రబాబు అబద్దాలు చెబితే ప్రజలు మరోసారి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com