ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మార్పులు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు. ఆదివారం మధ్యాహ్నం వెంకటగిరి త్రిభువని సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. ‘‘ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమా?. చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే. రూ.3 వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అంటూ గుర్తుకొచ్చేది జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది జగన్. మహిళా సాధికారిత అంటే గుర్తుకొచ్చేది జగన్. సంక్షేమ పథకాలంటే పేదవాడికి గుర్తుకొచ్చేది జగన్. రైతన్నల చేయిపట్టుకుని నడిపించేది ఎవరంటే గుర్తుకొచ్చేది జగన్. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చాం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఉందా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.