చంద్రబాబు చెప్పేవి అన్నీ అబద్ధాలే.. ఆయన మాటకు కట్టుబడి ఉండరని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మాకు ఓటు వేయమని ఆ రోజు అడిగాం అడిగాం కనుకనే మూలపేటలో నాలుగు వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేశాం. శ్రీకాకుళం జిల్లాను ప్రపంచం తో కనెక్ట్ చేశాం. మాకు ఓటు వేశారు కనుకనే ఉద్దానంకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉపరితల జలాలు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేశాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఆరు మండలాల సమస్యను పరిష్కరించాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో వంశధార నీరు ఇంటింటికీ అందించాం. మాకు ఓటేశారు కనుకనే రెండు వందల కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. మాకు ఓటేశారు కనుకనే శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్టర్లను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా పెట్టి ఇవాళ ఏ కేసునీ విశాఖ పట్నంకు రిఫర్ చేయకుండా ఆస్పత్రిని డెవలప్ చేశాం అని విన్నవిస్తున్నాను. ఎప్పుడయినా మీరేమయినా ఇన్ని పనులు చేశారా ? అలానే పరిపాలనను వికేంద్రీకరించాం. పాలనను మీ గుమ్మం దగ్గరకు తీసుకుని వచ్చాం. రెండు లక్షల యాభై వేల మందిని సచివాలయ వ్యవస్థ కోసం నియమించాం. ఇప్పుడు ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి కానీ జిల్లా కేంద్రానికి కానీ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇదంతా మీరు ఎన్నుకున్న ప్రభుత్వంతోనే సాధ్యం అయింది. మీరు ఓటేసి గెలిపించిన కారణంగానే సాధ్యం అయింది. మళ్లీ మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టండి అని పిలుపు ఇస్తున్నాను.. అని మంత్రి ధర్మాన అన్నారు.