వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అనేకకష్టాలు పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ రాజమహేంద్రవరం ఉమ్మడి ఎమ్మె ల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఆదివారం జేగరుపాడులో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష, సీనియర్ టీడీపీ నాయకులు గారపాటి అమరనాద్‌తో కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో అతి సుం దరంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని గోరంట్ల ప్రారంబించారు. పలువురు పార్టీలో చేరారు. వారికి గోరంట్ల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోరంట్ల మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. వైసీపీ ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. వారితోపాటు అనేక వృత్తులు వారు తీవ్ర ఇబ్బం దులు పడ్డారన్నారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కొత్త రహదారులు మాట ఎలాఉన్నా కనీసం రహదారులు మరమ్మతులు కూడా లేవన్నారు. మండలంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందన్నారు. గ్రామాల్లో మురుగునీరు పోయే విధంగా ప్రణాళికలు చేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కూ టమి అధికారంలోకి రాగానే ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, మండలంలో మాధవరాయుడుపాలెం గ్రామంలో 15వేల ఇళ్ల నిర్మాణం చేసి ఇల్లులేని ప్రతీ పేదవానికి ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి అమరనాద్, పాతూరి రాజేష్, నాగిరెడ్డి రామకృష్ణ, ఆకుల శ్రీధర్, ప్రత్తిపాటి రామారావుచౌదరి, గెడ్డం శివ, కర్రి చినబాబు, మర్రెడ్డి రమేష్, వల్లూరి మోహన్, వనమాలి బాలాజీ, కొమ్మరవత్తుల సూర్యకుమార్, నాగులపల్లి వీరబాబు, చిక్కాల శ్రీను, గారపాటి తాతబ్బాయి, ఉండమట్ల ప్రభాకర్, రామచంద్రరావు, వాసాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి దొరబాబు, వనమాలి శ్రీను, వాకలపూడి అరుణకుమార్, నూకపెయ్యి ప్రసాద్, పల్లపు రాజేష్, చిన్నం ప్రసాద్, బచ్చల కిరణ్, కె పవన్, పల్లపు అజయ్, పెనుమాటి పవన్, పెనుమాటి అవినాష్, తాడి సతీష్ లతో పాటు పలువురు యువత పార్టీలో చేరారు.