వైసీపీ పాలకులు రాజమహేంద్రవరాన్ని గత ఐదేళ్లుగా అస్తవ్యస్తం చేశారు. కూట మి అధికారంలోకి వచ్చాక నగరవైభవాన్ని ఇనుమడింపచేస్తూ మోడల్ సీటీగా అభి వృద్ధి చేస్తానని టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నా రు. రాజమహేంద్రవరం తుమ్మలావ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కమ్యూనిటీ హాలు వద్ద ఆదివారం రాత్రి టీడీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు యాళ్ళ ప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ-బీజేపీ-జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన, జనసేన సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్‌లు ముఖ్యఅతిఽథులుగా హాజరయ్యారు. ఈసందర్బంగా తొలుతు అనుశ్రీ, హితేష్‌లు మాట్లాడారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ అందరివాడని ప్రజలకు కష్టం అంటే ముందుంటాడన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమహేంద్రవరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తారన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుందన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. రాజమహేంద్రవరంలో 2019వరకు లేని బ్లేడు బ్యాచ్‌లు ఇప్పుడు ఎలా వచ్చాయని దానికి కారణం వైసీపీ కాదా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక యువకులుకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. మెగా డీఎస్సీ తీస్తారన్నారు. రాజమహేంద్రవరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తారని చెప్పారు. 25శాతం కమిషన్ తీసుకుని నగరంలో అనాలోచిత పనులు చేయడంవల్ల నగరంలో ముంపు ప్రాంతాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఒక ప్రణాళిక కూడా రూపొందించామన్నారు. నగర ప్రజలను సురక్షితమైన తాగు నీరు సమృద్దిగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చెత్తపై విధించిన పన్నులు, పార్కుల ప్రవేశ రుసుములు రద్దు చేయిస్తామన్నారు. ఎన్నికల్లో తనను, ఎంపీగా దగ్గుబాటి పురందేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆదిరెడ్డి వాసును, అనుశ్రీ సత్యనారాయణ, హితేష్ చెంచురామ్‌లను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తంగేళ్ళబాబి, గొర్రెల సత్యరమణి. కరగాని వేణు, యాళ్ళ వెంకట్రావు, పెద్దఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.