ఏలూరు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ముసునూరు మండలానికి ప్రచారానికి వెళ్తుండగా.. ఆయన కారును పలువురు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ వర్గీయులే ఈ దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.