ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ జూన్ 1 వరకు వర్తిస్తుందని, జూన్ 2న మళ్లీ లొంగిపోవాలని భారత సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa