రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్ లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు లూజు బాటిల్స్, కంటైనర్లో గానీ పెట్రోల్ అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బంకుల ఎదుట నోటీసులు అంటించాలని పోలీసులు సూచించారు.