ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎప్‌సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులతోపాటు... టాప్-10లో ఐదుగురు ఏపీ విద్యార్థులే సాధించారు. ఇంజనీరింగ్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత మొదటి ర్యాంకులు సాధించారు. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌కు చెందిన రిషి శేఖర్ శుక్లా ఇంజనీరింగ్‌లో 3వ ర్యాంకు, హనుమకొండ జిల్లాకు చెందిన గడ్డం శ్రీవర్షిణి అగ్రి-ఫార్మసీలో 3వ ర్యాంకు సాధించారు. జేఎన్టీయూ క్యాంప్‌సలో శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa