ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా? జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోండి

national |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 07:52 PM

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్న వారికి అలర్ట్. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావచ్చు. కొత్త నిబంధనల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.


కొత్త నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి మీకు ఓ సర్టిఫికేట్ జారీ చేస్తారు. దానితో మీరు ఆర్‌టీఓ ఆఫీసు ద్వారా లైసెన్స్ పొందవచ్చు. ఈ కొత్త రూల్స్ జూన్ నుంచి అమలులోకి వస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ కొత్త నిబంధనల ముఖ్యఉద్దేశం నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం, పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం.


మరోవైపు.. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది కేంద్రం. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి. అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలి. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.


లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలి. అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాలి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ ఉండాలి. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఉండాలి.


డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు ఇలా..


లర్నర్ లైసెన్స్ కోసం రూ.200


లర్నర్ లైసెన్స్ రెన్యువల్ రూ.200


ఇంటర్నేషనల్ లైసెన్స్ రూ.1000


పర్మనెంట్ లైసెన్స్ రూ.200


పర్మనెంట్ లైసెన్స్ రెన్యువల్ రూ.200


డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ కోసం రూ.10,000


డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ రూ.5000






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com