ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు వెళ్లే భక్తులకు మరో బ్యాడ్‌న్యూస్.. ఈ రైళ్లు రద్దయ్యాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:06 PM

తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తమిళనాడు వైపు నుంచి తిరుపతికి వచ్చే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రోజూ నడిచే స్పెషల్‌ ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కాట్పాడి-తిరుపతిల మధ్య రాకపోకలు రద్దు చేశారు. బెంగళూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూరు-తిరుపతి, విల్లుపురం-తిరుపతి మద్య రాకపోకలు సాగిస్తున్న ఎక్స్‌ప్రెస్‌లు కూడా రద్దయ్యాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. ఈకారణంగానే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.


మరోవైపు వేసవి రద్దీతో రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రైలు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది.. అక్కడి నుంచి కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వసపర్తి రోడ్‌, గద్వాల, రాయచూర్‌, ఆదోని, మంత్రాలయం రైల్వే స్టేషన్‌ల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. రైలు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com