అద్దంకి మండలం ఈ. ఓ. ఆర్డి, చీరాల డివిజన్ ఇన్ ఛార్జ్ పంచాయతీ అధికారి, దారా. హనుమంతరావు. సోమవారం నాడు కేశవరప్పాడు గ్రామం పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులు నిర్వహించాల్సిన సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంకు తాళం వేసి అధికారులు ఎవ్వరు అందుబాటులో లేకుండా పంచాయతీ ఆఫీసును మూసి ఉండటంతో స్పందించిన డి. ఎల్. పి. ఓ హనుమంతరావు, సదరు పంచాయతీ కార్యదర్శి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు.