ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్ తో ప్రజలు సైబరు మోసాలకు గురవుతున్నారని, నకిలీ కాల్స్ పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బుధవారం జిల్లా ఎస్పీ ఎం. దీపిక కోరారు. సైబరు మోసగాళ్ళు ప్రజల మొబైల్స్ కు ఫోను చేసి తాము ఫెడెక్స్ లేదా బ్లూ డాట్ కొరియర్ నుండి మాట్లాడుతున్నామని మనము బుక్ చేసిన కొరియర్ పార్సిల్లో నిషేదిత మాదక ద్రవ్యాలు, ఫేక్ పాస్పోర్టు, బంగారం వంటివి ఉన్నాయని గుర్తించినట్లు భయపెడతారన్నారు.