సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక-టేకిశెట్టిపాలెం వంతెనపై బుధవారం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వంతెన ఎత్తు ఎక్కువగా ఉండటంతో ఆటో అదుపుతప్పి ఉండవచ్చు అని ఘటనా స్థలంలోని స్థానికులు తెలియజేశారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.