కడప జిల్లా, గుర్రంకొండ మండలం తరిగొండలో కొలువైన లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున కల్యాణం నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగా ఉదయాన్నే ఆలయంలో అర్చన, పంచామృతాభిషేకం, విశేష పూజలను చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుంద రంగా అలంకరించి వేద పండితులు స్వామి వారి కల్యాణాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి అధిక సం ఖ్యలో భక్తులు రాగా తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్భట్టర్, కృష్ణప్రసాద్, కృష్ణరాజు, అనిల్, గోకుల్, వరద, వెంకీ, ఆలయాధికారి కృష్ణమూర్తి, సిబ్బంది నాగరాజ పాల్గొన్నారు.