‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్ పార్టీలు, రేప్ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ నేత సోమిరెడ్డికే ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అసలు సోమిరెడ్డిది నోరేనా, మనిషి జన్మేనా అని అనుమానం కలుగుతుందన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన, తనకు సంబంధించిన వాళ్లు, తన బంధువుల పాత్ర ఉన్నట్లు నిరూపించాలని సోమిరెడ్డికి, టీడీపీ నేతలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు.