సత్యసాయి జిల్లా హిందూపురం డి. ఎస్. పి పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ శ్రీనివాసులు బుధవారం పట్టణంలోని హస్నాబాద్ లో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల దృష్ట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్డెన్ సర్చ్ లో భాగంగా రికార్డు లేనటువంటి 16 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు అయన తెలిపారు.