ఉమ్మడి అనంత జిల్లాలో ఈనెల 25న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి బుధవారం తెలిపారు. అనంతపురం, గుత్తి, ఉరవకొండ డివిజన్లలో భారీ వర్షం కురుస్తుందన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, తాడిపత్రి డివిజన్లలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.