శ్రీసత్య సాయి జిల్లా పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో వయోజనులకు బి సి జి టీకా కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని వైద్యాధికారులు డా. స్వరూప రెడ్డి, డాక్టర్ నవీన, పర్యవేక్షకబృంద అధికారులు వన్నప్ప, వెంకమ్మ, రవీంద్ర, పార్వతమ్మలతో కలిసి పలు గ్రామాలలో టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.