కురుపాం-2 సచివాలయం పరిధిలోగల పూతికవలస గ్రామానికి ఆనుకుని ఉన్న లేఅవుట్ స్థలంలో గురువారం సంబంధిత సచివాలయ సిబ్బంది హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఇటీవల బుడా అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. వీరి పరిశీలనలో కొంతమంది రియల్ ఎస్టేట్దారులు ఇక్కడ ఎటువంటి అనుమతి లేకుండా క్రయవిక్రయాలు జరుపుతు న్నట్టు తెలుసుకున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి బి.అనితకు, సంబం ధిత సిబ్బందికి వివరణ కోరారు. ఈ మేరకు ఈ స్థలంలో అనుమతి లేకుండా క్రయ విక్రయాలు నిషేద్ధం, చట్ట వ్యతిరేకం అని పంచాయతీ అధికారులు గురువా రం హెచ్చరిక బోర్డు పెట్టారు. పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి.అని త, వీఆర్వో స్వరాజ్యం, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కె.రశ్మిత, తదితరులు పాల్గొన్నారు.