మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి లో పోలీస్ పీకెట్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలింగ్ రోజు గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పోలీస్ పీకెట్ ఏర్పాటు చేశారు. పుట్టపర్తి అర్బన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో4గురుపోలీసులతో కూడిన బృందం గ్రామంలో బందోబస్తును పర్యవేక్షిస్తుంది. ఫలితాలు వెల్లడి అయ్యేంతవరకు ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.