ముదిగుబ్బ మండలం జేకేపల్లి, సంకేపల్లి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ ఏడీఏ సత్యనారాయణ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించి వారికి అందించాల్సిన వేరుశనగ రకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముదిగుబ్బ వ్యవసాయ అధికారి లక్ష్మీనరసింహులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.