ధర్మవరం మండలం గొట్లూరు సమీపాన నిర్మాణంలో ఉన్న నైరా ఏరి డైట్ అనే కార్పొరేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్బీ విద్యార్థి సంఘం నాయకులు పోతలయ్య జిల్లా విద్యాశాఖ సూపరిండెంట్ ప్రసాద్ కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. నిర్మాణ దశలోనే ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.