తుని రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై విశాఖ వాసి ఒకరు శుక్రవారం అస్వస్థతకు గురై మృతి చెందారని జిఆర్పి ఎస్ ఐ అబ్దుల్ మారుఫ్ తెలిపారు. విశాఖపట్నం కృష్ణ మార్కెట్ ప్రాంతంలో బంగారు పనిచేసే మధుపాక భాస్కర్ రావు (45)గా గుర్తించామన్నారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నుంచి బ్రహ్మంగారి మఠానికి ట్రైన్ లో వెళ్తుండగా తుని రైల్వే స్టేషన్లో దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఎస్సై తెలిపారు.