చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందని, పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీఎం వైయస్ జగన్ విజయానికి తొలి సంకేతమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడా చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం వైయస్ జగన్‌కు బాసటగా నిలిచాయన్నారు.