గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఎన్నికల సమయంలో కూటమి తరఫున చురుకుగా వ్యవహరించారు. ఇది నచ్చని కొంతమంది బసవరావు ఇంటిపై దాడికి దిగారు. అయితే వారి ఆగడాలను స్థానిక టీడీపీ యువత అడ్డుకున్నారు. ‘మీ రౌడీయిజం ఇక్కడ కాదంటూ’ నిలబడ్డారు. ఒక్కసారిగా గ్రామస్థులు, టీడీపీ యువకులు ఎదురుతిరగడంతో బెదిరిపోయిన వారు చేసేదేమీ లేక బసవరావు ఇంటి వెనక నుంచి పారిపోయారు.