అల్లూరు జిల్లా జి.కె.వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందుపాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.