ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమి తెలియదని, అన్ని తెలుసు అని బిల్డప్ ఇస్తారని విమర్శించారు. వెబ్ క్యాస్టింగ్ పరిశీలించేంది ఎన్నికల సంఘం అని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వెబ్ క్యాస్టింగ్‌కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.