పల్నాడు జిల్లాలో పలు గ్రామాల్లో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉందని నరసరావుపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో వినుకొండ రూరల్ సీఐ సుధాకర్ తో కలిసి డీఎస్పీ ఆదివారం పర్యటించారు. ప్రజలు రోడ్లపై గుమికూడి ఉండ కూడదన్నారు. నాయకుల సభలు, సమావేశాలకు అనుమతులు లేవన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేల అందరూ సహకరించాలన్నారు.