ఈ నెల 12న టీడీపీ వారు చేసిన ఘర్షణలో గాయపడి హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఉమామహేశ్వర రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో ఆదివారం పరామర్శించారు. జగన్ మోహన్ రెడ్డితో కలసి లండన్లో ఉన్న జేసిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ కందుల రవీంద్రారెడ్డి ద్వారా ఫోన్లో మాట్లాడి సంఘటన గురించి వివరాలు అడిగి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ధైర్యంగా ఉండాలని చెప్పారు.