టీడీపీ సీనియర్ నాయకులు పలమనేరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సీపీ బాల సుందరం రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చేసిన పలు పార్టీల నాయకులు బాల సుందరం రెడ్డి మృతికి తమ సంతాపం తెలియజేశారు. పట్టణంలోని గుండు బావి ఎదురుగా ఉన్న శ్రీవాణి కళాశాల ప్రాంగణంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.