ఉరవకొండ మండలలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు, అర్చన, నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకు వచ్చారు. ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
![]() |
![]() |