మార్కెట్ లో చేపల ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో తెల్ల చేపలు రూ.10 నుంచి రూ.30 వరకు మాత్రమే పలుకుతుండడంతో చేపలను తరలించిన వ్యాను కిరాయి ఖర్చులు రావడం లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉక్కబోయడంతో చెరువుల్లో ఆక్సిజన్ లోపించి చేపలు భారీగా మృత్యువాత పడడంతో చేసేదేమీ లేక చేపలను వ్యాన్‌లపై ఆకివీడు మార్కెట్‌కు తరలించి తక్కువ ధరకు అమ్ముతున్నట్టు రైతులు తెలిపారు. అసలే ఆదివారం కావడంతో తక్కువ ధరకే తెల్ల చేపలు లభిస్తుండటంతో ప్రజలు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు.
![]() |
![]() |