ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన ఫోటోగ్రాఫర్లకు తక్షణమే బిల్లులు చెల్లించాలని ఫోటోగ్రాఫర్లు స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఫోటోగ్రాఫర్లకు ఎనిమిది గంటలకు వెయ్యి రూపాయలు చొప్పున తమకు చెల్లిస్తామని అధికారులు చెప్పడం సమంజసంగా లేదని అన్నారు. రోజుకు 2, 100 రూపాయలు చొప్పున ఫోటోగ్రాఫర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు.