ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని అంబవరం రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లుగా రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. గుంటూరు మరియు గుంతకల్లు మధ్య డబల్ ట్రాక్ రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అంబవరం వైపు వెళ్లే రహదారిని మూసివేసామని చెప్పారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి అంబవరం వైపు వెళ్లే వాహనదారులు పాములపల్లి రైల్వే గేట్ నుంచి వెళ్లాలని రైల్వే అధికారులు వాహనదారులకు సూచించారు.