కంభం పోలీస్ స్టేషన్ లో సోమవారం మార్కాపురం డీఎస్పీ బాలసుందర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ఇప్పటికే గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ ఆదేశాలతో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అలానే అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కార్డెన్ సెర్చ్ లు నిర్వహించామన్నారు.