అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలంలోని అక్కదేవతలకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా లాగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం కొలను దగ్గర గుడికట్లు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గిరిగెల గంప ఊరేగింపుగా పొలాల నుంచి గ్రామంలోకి వచ్చారు. అక్కడక్కడ అమ్మవారి గంపకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.