కడప జిల్లాలోని వైవీ యూ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీబీఏ, బీకాం, బీ ఎస్సీ ఆరో సెమిస్టరు ఫలితాలను వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసరు చింతా సుధాకర్ విడుదల చేశారు. మంగళవారం తన కార్యాలయంలో రిజిస్ట్రార్ వైపీ వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసరు ఈశ్వర్‌రెడ్డితో కలిసి పరీక్ష ఫలితాల గణాంకాలను పరిశీలించి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఏలో 658 మంది పరీక్షలు రాయగా వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బీబీఏలో 249 మంది కూడా వంద శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. బీకాం లో 98 శాతం బీఎస్సీలో 98 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. డిగ్రీపరీక్షలు గత నెల లో మొదలై ఈ నెల 24 వరకు జరిగాయన్నారు. త్వరితగతిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యేందుకు కృషి చేసిన వైవీయు పరీక్షల విభాగాన్ని అభినందించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ సహాయ అధికారి డాక్టర్ గంగయ్య పాల్గొన్నారు.